సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనంఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతున్న ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నట్లు పేర్కొంది.
కుమ్రంభీం–ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు సైతం కురుస్తాయని అంచనా వేసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 0.9 సెం.మీ.వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5.3 సెం.మీ.వర్షపాతం నమోదు కాగా, 51 శాతం లోటు వర్షపాతం ఉన్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment