హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీనివాస్‌రెడ్డి
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య ధియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన, తదనంతర పరిణామాల నేపథ్యంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వాన్నిఅస్థిరపరిచి కూల్చేందుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనను ఆసరాగా తీసుకుని తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు, కవిత కలిసి ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) సాయంతో ఢిల్లీలో నరేంద్ర మోదీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని పడగొట్టి గవర్నర్ పాలన తీసుకువద్దామని చూస్తున్నారని ఆయన అన్నారు.
మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాయని, రాబోయే 48 గంటల్లో ఏదో అల్లకల్లోలం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారం లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీ ఉండలేదని, ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ (KCR) మౌనంగా లేరని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు స్కెచ్ వేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్, బీజేపీ చీకటి కోణాలను త్వరలో బయటపెడతామని ప్రకటించారు. న్యాయం వైపు ఉంటేనే ఈ రెండు పార్టీలకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు. సినిమా వాళ్లు రాజకీయాల్లో వేలుపడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
సినీ పరిశ్రమను బోనులో పెట్టే ప్రయత్నం: ఈటల
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొత్తం సినీ పరిశ్రమను బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను మంగళవారం ఆయన కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఘటనను సీఎం రేవంత్‌రెడ్డి వివాదంగా చేస్తున్నట్లుందని ఆరోపించారు. హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun) కావాలనే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి స్టేషన్‌లో కూర్చోబెట్టడం మంచిది కాదని హితవు పలికారు.
రాజకీయం చేయడం తగదు: డీకే అరుణ
సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని.. లేకుంటే దీన్ని సినీపరిశ్రమపై ప్రభుత్వ వేధింపులుగా భావించాల్సి వస్తుందని ఎంపీ డీకే అరుణ (DK Aruna) వ్యాఖ్యానించారు. మంగళవారం శ్రీతేజను పరామర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బాలుడి కుటుంబాన్ని ఆదుకొనే బాధ్యత సీని పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కాగా, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సైతం బాలుడిని పరామర్శించారు.
చదవండి: సంధ్య థియేటర్ పరిణామాలు.. సంక్షోభం సినీ రంగానికా? రాజకీయానికా?
Comments
Please login to add a commentAdd a comment