న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌ను అప్పగించాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆదేశించారు. దీంతో విచారణ గది నుంచి బయటకొచ్చిన కవిత.. తన పర్సనల్ సెక్యూరిటీ దగ్గరున్న ఫోన్‌ను ఈడీ అధికారులకు అదించారు. అంతక ముందే ఇంటి వద్ద ఉన్న ఎమ్మెల్సీ ఫోన్‌ను సెక్యూరిటీతో ఈడీ అధికారులు తెప్పించారు. కవిత ఫోన్‌లో ఉన్న డేటాను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు.
కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ ఈడీ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతోంది. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం అయిదు గంటలుగా ఆమెను ప్రశ్నిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై విచారణ జరుగుతోంది. ఆరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టు, ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నారు.
చదవండి: కవితను ప్రశ్నిస్తున్న ఈడీ స్పెషల్ టీమ్
Comments
Please login to add a commentAdd a comment