సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పరిస్థితి కట్టుబానిసల్లా తయారైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పేరుకే పార్ట్‌టైమర్లు అయినా వారితో ఫుల్‌టైమ్ పనిచేయించుకుం టున్నారని, గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారే తప్ప వారి సమస్యలు పరిష్కరించేందుకు ఈ ప్రభు త్వం ముందుకు రావడం లేదని విమర్శించారు. వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు మంగళవారం రేవంత్‌రెడ్డి బహి రంగ లేఖ రాశారు.
ఏళ్ల తరబడి పదోన్నతులు లేక, చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న వీఆర్‌ఏల బాధ వర్ణనాతీతమని, ఉపాధి హామీ కూలీలకంటే దీనమైన స్థితిలో వారు కాలం వెళ్లదీస్తున్నారని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతం, పని ఒత్తిడితో గుండె పోటుకు గురై కొందరు చనిపోతుంటే, మరికొం దరు ఆత్మహత్యలు చేసు కుంటున్నారని వెల్లడించారు.
(చదవండి: రాష్ట్రాన్నే సరిగ్గా పాలించట్లేదు.. దేశాన్ని ఏలతారట )
రాష్ట్రంలో పనిచేస్తున్న 23 వేల మంది వీఆర్‌ఏలకు పేస్కేల్ ఇస్తామని 2020 సెప్టెంబర్ 9న అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని కేసీఆర్‌ను ప్రశ్నిం చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కు లేకపోతే రాష్ట్రంలో పాలన ఉన్నట్టో లేనట్టో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. వీఆర్‌ఏలు రోడ్డెక్కేం దుకు కారణమైన మీరే, వారి సమస్యలను పరిష్క రించాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని హెచ్చరిం చారు.
సీఎం హామీ ఇచ్చిన విధంగా వీఆర్‌ఏలకు పేస్కేల్ వర్తింపజే యాలని, అర్హులైన వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలని, సొంత గ్రామాల్లో వారికి డబుల్‌బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని, విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్‌ఏల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కేసీఆర్‌కు రాసిన లేఖలో రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
(చదవండి: కరోనాను మించి ముంచుతోంది!)
Comments
Please login to add a commentAdd a comment