సాక్షి, హైదరాబాద్: మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో నాగేశ్వరరావుపై అత్యాచారం, హత్యాయత్నం, ఆర్మ్స్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నాగేశ్వర్ రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీదు, బోనాల పండుగ బందోబస్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుపల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియమించారు. కాగా జూలై 7న అర్థరాత్రి ఇన్‌స్పెక్టర్ తనపై అత్యాచారం జరిపినట్లు ఆరోపిస్తూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
హస్తినాపురంలో నివసిస్తున్న మహిళ ఇంటికి సీఐ నాగేశ్వరరావు వెళ్లాడు. అర్థరాత్రి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బయటకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగి రావడంతో అతన్ని సీఐ రివాల్వర్‌తో బెదిరించాడు. అర్ధరాత్రి సమయంలో ఆ దంపతులిద్దరిని కారులో ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాడు. అయితే కారు రోడ్డు ప్రమాదానికి గురవడంతో.. సీఐ నుంచి దంపతులిద్దరూ తప్పించుకుని, వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చదవండి: Hyderabad: చారిత్రక భాగ్యనగరికి విదేశీ పర్యాటక కళ
Comments
Please login to add a commentAdd a comment