సాక్షి, హైదరాబాద్: ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు పరిమితమైన ఈ సర్వీసులను ఉందానగర్‌కు విస్తరించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. రెండో దశలో ఉందానగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మరో 6 కిలోమీటర్ల మార్గా న్ని కొత్తగా నిర్మించి ఎయిర్‌పోర్టుకు రైళ్లు నడిపేం దుకు దక్షిణమధ్య రైల్వే సిద్ధంగా ఉన్నా జీఎమ్మార్ నిరాకరించడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఉందా నగర్ వరకు నడిపేందుకే అధికారులు పరిమితమ య్యారు. భవిష్యత్తులో జీఎమ్మార్ అంగీకరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు చేరుకొనేలా విస్తరిం చనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు 95 కిలోమీటర్ల మార్గం డబ్లింగ్, విద్యుదీకరణ పనులు ఈ నెల 31 నాటికి పూర్తి కానున్నాయి.
దీంతో ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించేందుకు అవకాశం లభించింది. అలాగే సికింద్రాబాద్ నుంచి మహబూ బ్‌నగర్ వరకు ఇంటర్‌సిటీ సర్వీసులు నడిచే అవకా శం ఉంది. ప్రస్తుతం 8 ప్యాసింజర్ రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. డబ్లింగ్ పూర్తయిన దృష్ట్యా మరో రెండు సర్వీసులు కొత్తగా ప్రవేశపెట్ట నున్నారు. కాగా, హైదరాబాద్ నుంచి బెంగళూర్, తిరుపతికి వెళ్లే రైళ్లు ఇకపై సికింద్రాబాద్–డోన్ మార్గంలోనూ రాకపోకలు సాగిస్తాయి. ఫలితంగా దూరంతో పాటు, కనీసం గంటకు పైగా ప్రయాణ సమయం తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment