ప్రధాని నరేంద్ర మోదీ (పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ కంటే ముందుగా ఆయన హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం.
గురువారం మధ్యాహ్నం 12గం.50ని.కు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ చేరుకుంటారు. ఆపై ఒంటిగంట నుంచి పదిహేను నిమిషాల పాటు బీజేపీ నేతలతో భేటీ అవుతారు. ఆపై బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్‌లో హెచ్‌సీయూకి చేరుకుంటారు ప్రధాని.
అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో.. ఐఎస్‌బీకి వెళ్తారు. ఐఎస్‌బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం ఆయన బేగంపేట్ చేరుకుని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్తారు. బీజేపీ నేతలతో ప్రధాని మోదీ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.
మోదీ వ్యతిరేక ఫ్లెక్సీలు
ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా.. ఆయనకు స్వాగతం చెబుతూ బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే అక్కడక్కడ వ్యతిరేక ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. మొత్తం పదిహేడు చోట్ల ప్రధానిని ప్రశ్నిస్తూ.. ఆ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలంటూ టీఆర్‌ఎస్ నేతలు వీటిని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment