ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు
లబ్ధిదారులతో మాట్లాడనున్న సీఎం రేవంత్‌రెడ్డి
500 రైతు వేదికల్లో సంబురాలు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ ప్రక్రియలో మొదటి విడతగా గురువారం రూ.లక్ష వరకు రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు బుధవారం ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ జరిగింది.
రుణమాఫీ ప్రక్రియ సజావుగా జరిగేందుకు దీనిని నిర్వహించారు. అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో సరిచూసుకున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల్లో సంబురాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ నిధులను విడుదల చేసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఆన్‌లైన్‌లో రైతులతో మాట్లాడనున్నారు.
కొన్ని గ్రామాల్లో గందరగోళం
రైతు వేదికల్లో వేడుకలకు సంబంధించి స్థానిక అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి గ్రామం నుంచి రైతులను తరలించనున్నారు. ఇలావుండగా రుణమాఫీకి సంబంధించి అధికారులు రూపొందించిన జాబితాపై అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో గందరగోళం నెలకొంది. జాబితాలో తమ పేర్లు లేవంటూ కొందరు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment