సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విపత్తు నిర్వహణ-ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (హైడ్రా)కు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రాలో కొత్తగా వివిధ కేటగిరిల్లో 169 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ విభాగాల్లో డిప్యూటేషన్‌పై సిబ్బంది నియామకం చేపట్టింది.
కాగా, హైడ్రాకు పూర్తిస్థాయి స్వేచ్ఛ కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖలకు ఉన్న విశేష అధికారాలను హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయించింది.
ఓఆర్‌ఆర్‌కు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని 24 పురపాలికలు, 51 గ్రామ పంచాయతీల పరిధిలో అన్ని శాఖలకు ఉన్న స్వేచ్ఛ(అధికారాలు)ను హైడ్రాకు కల్పించేలా నిబంధనలను సడలించింది. వివిధ విభాగాలకు చెందిన 169 మంది అధికారులను హైడ్రాలో నియమించింది.
ఇదీ చదవండి: మూసీ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్.. బాధితుల కోసం ప్రభుత్వం స్పెషల్ ప్లాన్!
Comments
Please login to add a commentAdd a comment