
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలతో లైఫ్ సైన్సెస్ రంగం బహుముఖంగా విస్తరిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. లైఫ్‌సైన్సెస్ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయని పేర్కొన్నా రు. ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరం)తోపాటు లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగాల ప్రముఖు లతో మంగళవారం ఇక్కడ జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి కేటీఆర్ అధ్యక్షత వహించారు.
తెలంగాణలో లైఫ్‌సైన్సెస్ వాతావరణాన్ని బలోపేతం చేసే మార్గాలను అన్వేషించడంతోపాటు విశ్వవ్యాప్త ంగా హెల్త్ నెట్‌వర్క్‌తో హైదరాబాద్‌ను అనుసంధానించేందుకు అనుసరించాల్సిన విధానాలే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం విలువ, ప్రభావాన్ని మరింత పెంచేందుకు ప్రపంచ ఆర్థిక వేదికతో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యరక్షణ రంగాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉపయోగపడు తుందని ఈ వేదిక బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది.
సమావేశంలో ప్రపంచ ఆర్థిక వేదిక హెల్త్‌కేర్ విభాగం అధిపతి డాక్టర్ శ్యామ్ బిషెన్, భారత్, దక్షిణాసియా డిప్యూటీ హెడ్ శ్రీరామ్ గుత్తా, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, లైఫ్‌సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్‌తోపాటు రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, బయోలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్ల, అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్‌చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.