
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్‌ను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది.
కాగా, శనివారం.. టీఎస్‌పీఎస్సీ 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీజోన్-1లో 54, మల్టీజోన్-2లో 59 పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జనవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 01 వరకు దరఖాస్తలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 23న పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment