
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట) : కరోనా వైరస్ మనం నిత్యం వాడుకునే వస్తువులపై ప్రభావం చూపకుండా అడ్డుకోవడానికి సిద్దిపేటకు చెందిన కాపర్తి భార్గవ్ అనే యువశాస్త్రవేత్త యూవీసీ వైరస్ కిల్లర్ మెషీన్ రూపొందించాడు. భార్గవ్ హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సెకండియర్ చదువుతున్నాడు. ప్రజలు కరోనా వైరస్‌తో ఇబ్బందులు పడుతున్న తీరును గమనించిన భార్గవ్ ఈ వైరస్ కిల్లర్‌ను తయారు చేశాడు. కేవలం రూ. 600 ఖర్చుతో అట్టబాక్స్, రిఫ్లెక్షన్ కవర్, థర్మకోల్, యూవీసీ (అల్ట్రా వయొలెట్ కాంపైజర్) బల్బ్, కనెక్టర్‌లతో ఈ పరికరాన్ని రూపొందించాడు. నిత్యావసర సరుకులు, బయటకు వెళ్లి వచ్చినప్పుడు మన వస్తువులను బాక్స్‌లో పది నిమిషాలుంచితే వైరస్ ఉన్నట్టయితే చనిపోతుంది. దీంతో ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చన్నాడు. యూవీసీ కిరణాలు మన శరీరానికి తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. (ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి )
Comments
Please login to add a commentAdd a comment