తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ క్రీడా మైదానంలో శనివారం ఉదయం 7.30 గంటలకు హాకీ సీనియర్, బాలుర జిల్లా జట్లు ఎంపికకు పోటీలు నిర్వహించనున్నారు. ఆ మేరకు హాకీ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఆదిత్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంపికై న సీనియర్ బాలుర జట్టు మార్చి 6 నుంచి 9వ తేదీ వరకు గుంటూరులో నిర్వహించనున్న 15వ హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే బాలుర విభాగపు క్రీడాకారులు బర్త్ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, 1 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీసుకురావాలని సూచించారు. వివరాలకు 70131 77413 నంబరులో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment