
ఈ గెలుపే నీదిరా!
మెరుపై సాగరా..
తిరుపతి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు శనివారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్–1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్‌లో 31,851 మంది, ఒకేషనల్‌లో 1,313 మంది మొత్తం 33,164 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో జనరల్‌లో 720 మంది, ఒకేషనల్‌లో 100 మంది, మొత్తం 820 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. డెఫ్ అండ్ డంబ్ విద్యార్థులు సహాయకుల సహకారంతో పరీక్షను రాసినట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 86 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్–2 పరీక్ష జరగనుంది.
పటిష్టంగా ఇంటర్ పరీక్షలు
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పరీక్ష నిర్వహణాధికారులను ఆదేశించారు. తిరుపతి రూరల్, వేదాంతపురం పంచాయతీ పరిధిలోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఏర్పాటుచేసిన సీసీ కెమరాల పర్యవేక్షణలో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సీసీ కెమెరాలను అమరావతిలోని ఇంటర్ బోర్డుకు అనుసంధానించడంతో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు
తొలి రోజు 820 మంది గైర్హాజరు

ఈ గెలుపే నీదిరా!

ఈ గెలుపే నీదిరా!
Comments
Please login to add a commentAdd a comment