
దొంగ అరెస్టు
– రూ.12 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం
నాయుడుపేట టౌన్: నేర ప్రవృత్తికి అలవాటు పడి ఇంటి ముందు ముగ్గులు వేసే మహిళలు, వృద్ధులను టార్గెట్ చేసుకుని దొంగతాలకు పాల్పడుతున్న నిందితుడు కావాలి భవానీశంకర్‌ను పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.12 లక్షల విలువ గల 170 గ్రాములు బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టణంలోని పోలీస్ డివిజన్ కార్యాలయంలో శనివారం డీఎస్పీ ఆ వివరాలను వెల్లడించారు. నాయుడుపేట ప్రాంతంలో తరచూ బంగారు గొలుసులు చోరీలు జరుగుతుండడంపై నాయుడుపేట సీఐ బాబి, ఎస్‌ఐ ఆదిలక్ష్మి, ఐడీ పార్టీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో శనివారం పట్టణ పరిధిలోని మల్లాం జాతీయ రహదారి కూడలి వద్ద అనుమానాస్పదంగా నిలుచుకుని ఉన్న భవానీశంకర్‌ను పట్టుకున్నట్లు వివరించారు. విచారణలో అసలు విషయం బయటపడింది. నిందితుడు నాయుడుపేట పట్టణంలోని పొగొట్టం కాలనీ కాలవగట్టు ప్రాంతానికి చెందిన వాడుగా గుర్తించారు. ఇతడిపై 2021 నుంచి 2025 వరకు 8 కేసులు ఉన్నట్టు డీఎస్పీ వివరించారు. నిందితుడి వద్ద నుంచి 8 బంగారు చైన్‌లు, 1 బంగారు నల్లపూసల దండ మొత్తం 170 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షలకు పైగా ఉంటుందన్నారు. నిందితుడిని పట్టుకున్న సీఐ, ఎస్‌లతో పాటు హెడ్‌కానిస్టేబుల్ కోండూరు రామ్మోహన్‌రాజు, కానిస్టేబుల్ అన్నుదయాకర్, షేక్ సుహెల్‌బాబు, డీ.పోలయ్యలకు నగదు రివార్డులను అందించారు.

దొంగ అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment