తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి ఒక నెలలోనైనా ఒకటో తారీఖు వేతనం చూడలేదని వేతనజీవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎస్వీయూ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వేతనాలు ఎప్పుడు పడతాయో తెలియని దయనీయస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో అధ్యాపకులకు గత మాసం వేతనలు నిచిపోయాయి. మార్చి 3వ తేదీ వస్తున్నా జనవరి, ఫిబ్రవరి మాసాల జీతాల కోసం అధ్యాపకులు ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ వారంలోనైనా రెండు నెలల వేతనాలు అందేనా.. గోవిందా అంటూ వర్సిటీలో ఏ ఇద్దరు ఉద్యోగులు తారసపడినా ఇదే చర్చ సాగుతోంది. అలాగే గత మాసం నాన్ టీచింగ్ స్టాఫ్ సమ్మె సైరన్ మోగిస్తున్నామని హెచ్చరించడంతో అధికారులు శాశ్వత ఉద్యోగులకు డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి జీతాలు అందజేశారు. ఈ నెల ఎప్పటికి జీతం అందుతుందోనన్న అయోమయం ఉద్యోగుల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment