‘షకలక’ శంకర్ హీరోగా, అక్సఖాన్, రూపిక హీరోయిన్లుగా రాజీవ్ కనకాల ప్రధాన ΄ాత్రలో నటించిన చిత్రం ‘దళారి’. కాచిడి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట రెడ్డి నిర్మించిన ఈ సినిమా మార్చిలో రిలీజ్ కానుంది. కాగా తెలంగాణలోని వేములవాడలో ‘ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ సింగర్స్’(ఐటీఎఫ్) నిర్వహించిన గూగులమ్మతల్లి బోనాలు కార్యక్రమంలో ‘దళారి’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ‘‘ఈ కరీంనగర్ జిల్లా బిడ్డగా అందర్నీ మెప్పించే కథతో ‘దళారి’ సినిమా తీశాను’’ అన్నారు కాచిడి గోపాల్ రెడ్డి. ‘‘ఈ సినిమా కథ,పాటలు, డ్యాన్సులు, ఎమోషన్స్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటాయి’’ అన్నారు వెంకట్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment