అభివృద్ధిలో పేదలకే ప్రాధాన్యం
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: పేదలు అధికంగా నివసించే కాలనీల్లో అభివృద్ధి పనులకు తొలి ప్రాధాన్యం కల్పిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మల్‌రెడ్డిపల్లి ప్రాంతంలో రూ.2.08 కోట్ల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరు మున్సిపాలిటీ దశాబ్ద కాలంగా అధ్వానంగా మారిందన్నారు. మున్సిపాలిటీలో మురుగు కాల్వలు లేక పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. దశాల వారీగా డ్రైనేజి, సీసీ రోడ్లను మెరుగు పరుస్తామన్నారు. మొదటగా అధికంగా ఇబ్బందులకు గురవుతున్న ప్రాంతాలను గుర్తించామనారు. త్వరితగతిన పనులను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
కార్తీక దీపోత్సవం
పట్టణంలోని కట్టమైసమ్మ దేవాలయంలో మంగళవారం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాలకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్తీక దీపాలను వెలిగించారు.
Comments
Please login to add a commentAdd a comment