పిడుగు | - | Sakshi
Sakshi News home page

పిడుగు

Published Wed, Jan 29 2025 1:17 AM | Last Updated on Wed, Jan 29 2025 1:17 AM

పిడుగు

పిడుగు

ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపు ● అత్యధికంగా 131 శాతం పెంపు ● ఆశీలమెట్టలో రూ.72 వేల నుంచి రూ.1.2 లక్షలు ● శివారు ప్రాంతాల్లోనూ భారీగా పెరగనున్న విలువలు ● రియల్‌ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం
మరో

విశాఖ సిటీ: మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను చేరిపేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. విశాఖలో స్థిరాస్తి రంగాన్ని దెబ్బతీసేందుకు సన్నద్ధమైంది. జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో అశాసీ్త్రయంగా భూముల విలువ సవరణ చేపడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా 70 శాతం వరకు రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ భూముల రిజిస్ట్రేషన్లపై వడ్డనకు ముహూర్తం ఖరారు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి త్రైమాసికానికి రూ.150 కోట్ల మేర ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. రెవెన్యూ, జీవీఎంసీ అధికారులతో కలిసి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ కూడా ఆమోదముద్ర వేశారు.

ఇష్టానుసారంగా పెంపు

కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను నింపుకునేందుకు విశాఖనే ఆదాయ వనరుగా ఎంచుకుంది. దీంతో జిల్లాలో భూముల విలువలను అమాంతం పెంచేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 70 శాతం వరకు భూముల విలువను సవరించింది. నగరంలో ఇప్పటికే భూముల విలువలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అయినప్పటికీ మరోసారి 20 శాతం నుంచి పెంచుకుంటూ పోయారు. నగరంలో ఆశీలమెట్ట, రామ్‌నగర్‌, ఎంవీపీ కాలనీ, బీచ్‌ రోడ్‌, సీతమ్మధార, హెచ్‌బీ కాలనీ, మద్దిలపాలెం, వెంకోజీపాలెం ప్రాంతాల్లో భారీగా పెరగనుంది. ఆశీలమెట్ట ప్రాంతంలో ప్రస్తుతం గజం రూ.72 వేలు ఉండగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రూ.1.2 లక్షలు కానుంది. అలాగే పాండురంగాపురంలో రూ.75 వేల నుంచి రూ.లక్ష, ఎంవీపీ కాలనీలో రూ.75 వేల నుంచి రూ.90, ప్రకాశరావుపేటలో రూ.67 వేల నుంచి రూ.80 వేలు, మురళీనగర్‌లో రూ.59 వేల నుంచి రూ.67 వేలు, గాజువాకలో రూ.22 వేల నుంచి రూ.32 వేలు వరకు పెరగనుంది.

శివార్లలోను భారీగా..

శివారు ప్రాంతాల్లో కూడా భారీగా భూముల విలువలు పెరగనున్నాయి. ప్రధాన జంక్షన్లు, వాణిజ్య ప్రాంతాల్లో మాదిరిగానే శివార్లలో కూడా కొన్ని చోట్ల 20 నుంచి 50 శాతం వరకు విలువను పెంచారు.

గోపాలపట్నం, వేపగుంట, ముడసర్లోవ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో భారీగా విలువ సవరించడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ వాటిని ఏ మాత్రం పట్టించుకోలేదు. అలాగే మధురవాడ నుంచి భీమిలి వరకు, వేపగుంట నుంచి పెందుర్తి వరకు కూడా భారీగానే భూముల విలువ పెరగనున్నాయి. ఆనందపురం మండలం శిర్లపాలెంలో గజం భూమి ప్రభుత్వ ధర రూ.650గా ఉంది. మార్కెట్‌ విలువ రూ.2 వేలు కాగా.. దానిని ఇప్పుడు 131 శాతం పెంచి రూ.1,500 చేశారు. అలాగే బోని గ్రామంలో 58 శాతం, ముడసర్లోవలో 43 శాతం, గుడ్లవానిపాలెంలో 38 శాతం, పద్మనాభం మండలం అమనాంలో 33 శాతం, సాయి ప్రియా లేఅవుట్‌లో 26 శాతం ఇలా గ్రామాల్లో సైతం భూముల విలువలను భారీగా సవరించారు. అలాగే వ్యవసాయ భూముల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి.

పద్మనాభం మండలం అమనాంలో ఎకరా భూమి రూ.45 లక్షలు కాగా 33 శాతం పెంచి రూ.60 లక్షలు చేశారు. చేపలుప్పాడలో ఎకరం రూ.1.3 కోట్లు కాగా.. 23 శాతం పెంచి రూ.1.6 కోట్లకు సవరించారు. దాకమర్రిలో ఎకరం రూ.1.2 కోట్లు ఉండగా, 23 శాతం పెంచి రూ.1.6 కోట్లు చేశారు.

భూముల ధరలు(చదరపు గజం) రూ.లలో

ఆశీలమెట్ట 72,000 1,20,000

ఆర్టీసీ కాంప్లెక్స్‌ 1,05,000 1,12,000

అక్కయ్యపాలెం 70,000 76,000

పాండురంగాపురం 75,000 1,00,000

ఎంవీపీ 75,000 90,000

వీఐపీ రోడ్డు 75,000 90,000

ప్రకాశరావుపేట 67,000 80,000

మర్రిపాలెం 55,000 65,000

మురళీనగర్‌ 59,000 67,000

మధురవాడ 45,000 55,000

బుచ్చిరాజుపాలెం 35,000 40,000

గాజువాక 22,000 32,000

షీలానగర్‌ 16,000 22,000

రుషికొండ 25,000 30,000

అడవివరం 20,000 23,000

నాయుడుతోట 24,000 27,000

కాకానినగర్‌ 40,000 45,000

పీఎంపాలెం 40,000 44,000

గుడ్లవానిపాలెం 24,000 33,000

స్థిరాస్తి రంగంపై ప్రభావం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ ఒక్కసారిగా పుంజుకుంది. ప్లాట్లు, ఫ్లాట్ల రేట్లు గణనీయంగా పెరిగాయి. దీంతో స్థిరాస్తి రంగం ఊపందుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారిగా రియల్‌ ఎస్టేట్‌ కుదేలైంది. ప్లాట్ల, ఫ్లాట్ల అమ్మకాలు పడిపోయాయి. ఇక కొత్త లేఅవుట్లు, ప్రాజెక్టులు ప్రారంభించేందుకు వ్యాపారులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో భూముల విలువను భారీగా పెంచడంతో ఆ ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ రంగంపై పడనుంది. కూటమి ప్రభుత్వ నిర్ణయం కోలుకోలేని దెబ్బగా స్థిరాస్తి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

పెరగనున్న ఫ్లాట్ల ధరలు

ఒకవైపు ప్లాట్ల ధరలతో పాటు ఫ్లాట్ల విలువ కూడా గణనీయంగా పెరగనుంది. వీటి విలువలు కూడా 20 శాతానికి పైగా సవరించారు. బీచ్‌ రోడ్డులో రూ.5 వేలు నుంచి రూ.6 వేలు కానుంది. నగరంలోనే కాకుండా శివారు ప్రాంతాల్లో కూడా చదరపు అడుగు విలువను పెంచారు. గాజువాక, పెందుర్తి, ఎండాడ, మధురవాడ, పీఎంపాలెం, బక్కన్నపాలెం, మిథిలాపురం కాలనీ ప్రాంతాల్లో 5 నుంచి 15 శాతం వరకు పెరగనున్నాయి. ఈ ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఇప్పటికే ప్రకటించారు.

ఫ్లాట్ల ధరలు (చదరపు అడుగు)రూ.లలో

ప్రస్తుతం పెరిగిన

ఎంవీపీ కాలనీ 4,500 5,300

బీచ్‌ రోడ్డు 5,000 6,000

కిర్లంపూడి లేఅవుట్‌ 5,000 6,000

మురళీనగర్‌ 4,500 5,100

మర్రిపాలెం 4,400 4,400

మాధవధార 4,600 5,100

ప్రహ్లాదపురం 3,200 3,600

పీఎంపాలెం 4,000 4,200

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement