వాల్తేరు డివిజన్‌లో ఏటా బడ్జెట్ బండి కోసం
ఎదురు చూపులు తప్పడం లేదు. గంపెడు
నిధులతో పరుగులు పెడుతూ వస్తున్నట్లు
కనిపించినా..విత్త మంత్రి ప్రసంగం
ముగిసిన తర్వాత చూస్తే.. రైలు
వచ్చినట్లే వచ్చి బైపాస్‌లో మాయ
మైపోతోంది. దశాబ్దకాలంగా
అరకొర నిధుల విదిలింపులతో
వాల్తేరు పరిధిలో ప్రాజెక్టులు
సా...గుతూనే ఉన్నాయి.
ఉత్తరాంధ్ర వాసుల చిరకాల
స్వప్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు
శంకుస్థాపన జరిగినా ఎలాంటి
కదలిక లేకపోవడంతో మళ్లీ కథ
మొదటికొచ్చింది. ఈసారైనా బడ్జెట్‌లో
సంపూర్ణంగా నిధులు కేటాయింపులు
చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ప్రతిపాదనలు ఇచ్చారా ఎంపీ సారూ.?
ప్రతి బడ్జెట్‌కు ముందు.. ఆయా ఎంపీలు తమ పరిధిలో చేపట్టాల్సిన ప్రాజెక్టులు, కొత్త రైళ్ల మంజూరు మొదలైన ప్రతిపాదనలను రైల్వే మంత్రిత్వ శాఖకు అందిస్తారు. వాటిని సాధించేందుకు నిరంతరం రైల్వే బోర్డు అఽధికారులతో సంప్రదింపులు చేస్తారు. ఈసారి కూడా కూటమి ఎంపీలు ఒక్క ప్రతిపాదన కూడా రైల్వే మంత్రికి అందించలేదని తెలుస్తోంది. బడ్జెట్ సమయంలో మంజూరు కాకపోతే కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కడం అసాధ్యమని తెలిసినా.. కూటమి ప్రభుత్వ ఎంపీల్లో ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment