సజావుగా ఇంటర్ పరీక్షలు
మహారాణిపేట: జిల్లాలో మార్చి ఒకటో నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పరీక్షల నిర్వహణపై సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 1 నుంచి 20 వరకు జరగనున్న ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరపు పబ్లిక్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. థియరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో భాగంగా సమన్వయంతో పనిచేసి పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను, ముందస్తు ప్రణాళిక చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఆర్ఐవో పి.మురళీధర్, డీవీఈవో బి.రాధ, పోలీస్, జీవీఎంసీ, వైద్యఆరోగ్య శాఖ, ఆర్టీసీ, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాట్లపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment