అభివృద్ధికి అవకాశమున్న రంగాలపై సమీక్ష
విశాఖ సిటీ: జిల్లాలో వనరులు, అభివృద్ధికి అవకాశం ఉన్న వివిధ రంగాలపై జిల్లా అధికారులతో నీతి ఆయోగ్ సభ్యులు సమీక్షించారు. శుక్రవారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో నీతి ఆయోగ్ ప్రధాన ప్రగతి చోదకాలైన ఆక్వా, ఔషధ, ఉక్కు, పెట్రోకెమికల్ రంగాలపై సమావేశం నిర్వహించారు. నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుబ్రహ్మణ్యం, సభ్యులు ఎస్.కిశోర్, కలెక్టర్ హరేందిరప్రసాద్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్విరాజ్, జీసీసీ ఎండీ కల్పనాకుమారి, వీఎంఆర్‌డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, ఈఎస్‌ఈజీ తరఫున శిరీష్‌శాంకే పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా జిల్లాలో వనరులు, అభివృద్ధికి అవకాశం ఉన్న రంగాలపై విస్తృతంగా చర్చించారు. వీఎంఆర్‌డీఏ జాయింట్ కమిషనర్ రమేష్, సీయూపీ శిల్ప పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
జీవీఎంసీ ప్రణాళికాధికారులపై ఆరోపణలు..వివరణకు ఆదేశం
అల్లిపురం: జీవీఎంసీ, జోన్–8 పరిధిలో అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారంటూ అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన నివేదిక మేరకు 24 మంది అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై వారిని వివరణ కోరుతూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడా ది నవంబర్ 3, 4 తేదీలలో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. జోన్ పరిధిలో అనధికారిక నిర్మాణాలను అనుమతించినట్లు గుర్తించింది. అప్పటి ఉప ప్రణాళికాధికారులు రాంబాబు, కె.పద్మజ, సహాయ ప్రణాళికాధికారులు కేవీ భాస్కర్‌బాబు, పి.మధుకుమార్, కృష్ణారావు, వెంకటేశ్వరరావు, రమణమూర్తి, శాస్త్రి , షబ్నమ్, జయరాం, (ఇన్‌చార్జ్ ఏసీపీ) ఎస్.వెంకటేశ్వరరావు, టీపీఓలు ఎం.తిరుపతిరావు, సీహెచ్ రఘునాథరావు, సీఎస్ ప్రవీణ్‌కుమార్, యు.రామకృష్ణ, డి.తేజేశ్వరరావు, విజయకుమార్, పి.ప్రమీలారాణి, ఎస్.లక్ష్మీజ్యోతి, టీడీబీవో చెట్టి అనిత, డబ్ల్యూపీఆర్‌ఎస్‌లు బి.రవితేజ, రెడ్డి అరుణ, స్వప్న, సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి,అప్పలనాయుడులపై అభియోగాలు నమోదు చేశారు. వారిచ్చే సమాధానానికి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment