గణబాబుకు అడ్డగోలు నజరానా | - | Sakshi
Sakshi News home page

గణబాబుకు అడ్డగోలు నజరానా

Published Sat, Feb 1 2025 1:11 AM | Last Updated on Sat, Feb 1 2025 1:11 AM

-

● వేపగుంటలో మల్టీప్లెక్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి అనుమతిస్తూ ఉత్తర్వులు ● ఆ స్థలంలో వివాదాలు ఉండడంతో 2019లో అనుమతి నిరాకరణ

పెందుర్తి: వడ్డించే వాడు మనవాడైతే బంతి ఆఖర్లో కూర్చున్నా ఇబ్బంది లేదన్నది నానుడి. కూటమి ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో అర్హత ఉన్నా లేకపోయినా అయినవారికి నజరానాలు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం ఉండదు. ఈ క్రమంలోనే దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మల్టీప్లెక్స్‌ సినిమా థియేటర్‌, షాపింగ్‌ మాల్‌, వాణిజ్య సముదాయంతో కూడిన ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పి.జి.వి.ఆర్‌ నాయుడు (గణబాబు)కు అనుమతి ఇస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి సిసోడియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేపగుంట సర్వే నంబర్‌ 76/3లో 4465 చదరపు మీటర్లలో ఆయా నిర్మాణాల చేపట్టేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. కాగా ఆయా నిర్మాణాలకు అనుమతి కోరుతూ 2019లోనే గణబాబు దరఖాస్తు చేసుకున్నారు. అయితే స్థానిక పరిస్థితులు, ఇతరత్రా అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

ఆగమేఘాల మీద అనుమతి

వేపగుంట సర్వే నెంబర్‌ 76/3లో మల్టీప్లెక్స్‌ నిర్మాణం కోసం 2019 నవంబర్‌లో గణబాబు దరఖాస్తు చేసుకున్నారు. అయితే స్థానికంగా స్థలంలో వివాదాలు ఉండడం, ఇతర సమస్యలపై సమీక్షించిన అధికారులు అప్పట్లో మల్టీప్లెక్స్‌ నిర్మాణం కోసం అనుమతిని నిరాకరించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అదే ప్రభుత్వంలో చీఫ్‌ విప్‌గా ఉన్న గణబాబు 2024 డిసెంబర్‌ 23న మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా, గత రికార్డులను పరిశీలించకుండా కేవలం నెలన్నరలో ఆగమేఘాల మీద భారీ నిర్మాణాలకు అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement