పరీక్షా కాలం
8లో
ప్రజలు కోరుకుంటున్నవేంటంటే...
● విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారాల విస్తరణ ఎంతో అవసరం. అదనపు ప్లాట్‌ఫారాలు లేకపోవడంతో ఔటర్‌లో గంటల తరబడి రైళ్లు నిలిచిపోతున్నాయి.
● రూ.76 కోట్లతో మర్రిపాలెం స్టేషన్ అభివృద్ధి పనులు ఐదేళ్ల క్రితం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. గోపాలపట్నం– మర్రిపాలెం మధ్య రెండు ప్రధాన లైన్లతో పాటు లూప్‌లైన్లు ఏర్పాటు కానున్నాయి. ఇవి ఏర్పాటైతే వైజాగ్ స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా మర్రిపాలెం అభివృద్ధి చెందుతుంది. కానీ నిధుల మంజూరు విషయంలో జాప్యం జరుగుతుండటంతో ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇవి పూర్తయితే వైజాగ్‌కు రాకుండా దువ్వాడ నుంచి బైపాస్ మీదుగా వెళ్లిపోతున్న 15 వరకూ రైళ్లు.. ఇక్కడికి వచ్చే అవకాశాలున్నాయి.
● రూ.159.47 కోట్లతో విశాఖ–గోపాలపట్నం మధ్య 15.31 కిమీ మేర 3వ, 4వ లైన్లు నిర్మాణ పనులు పూర్తి కావాలి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు డీపీఆర్ ఇచ్చి ఐదేళ్లు గడిచినా పనులు కాంట్రాక్టు సంస్థకు అప్పగించే పనిలోనే కాలం గడిచిపోతోంది.
● దువ్వాడ నుంచి ఉత్తర సింహాచలం వరకూ 20.54 కిమీ మేర రూ.92.62 కోట్లతో లైను అభివృద్ధి ప్రాజెక్టు మంజూరైనా.. ఇప్పటి వరకూ కేవలం రూ.8 కోట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో రెండేళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు మరో రెండేళ్లు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment