
అధికారులే బలిపశువులు
ఇద్దరికి బదిలీ
ఇన్‌చార్జి ఆర్డీగా ఉన్న రమణను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అతని స్థానంలో టూరిజం డివిజినల్ మేనేజర్‌గా ఉన్న వి.బి.జగదీష్ గేదెలను ప్రభుత్వం నియమించింది. అలాగే జిల్లా పర్యాటక శాఖ అధికారిగా ఉన్న జ్ఞానవేణిని మాతృశాఖకు పంపించింది. ఆమె స్థానంలో టూరిజం మేనేజర్‌గా ఉన్న జి.దాసుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
● కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనతో
రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దు
● ప్రపంచ స్థాయి ప్రమాణాల కల్పనకు నిధులివ్వని రాష్ట్ర ప్రభుత్వం
● ఇందుకు అధికారులను బాధ్యులను చేస్తూ బదిలీల వేటు
● టూరిజం ఇన్‌చార్జి ఆర్డీ రమణ,
డీటీవో జ్ఞానవేణిలకు స్థానచలనం
బ్లూ ఫ్లాగ్‌ను
తొలగించిన
దృశ్యం
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనకు అధికారులు బలిపశువులుగా మారారు. రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దు విషయంలో అధికారులనే దోషులుగా ప్రభుత్వం తేల్చింది. పర్యాటక శాఖ ఇన్‌చార్జి రీజినల్ డైరెక్టర్ రమణతో పాటు పర్యాటక శాఖాధికారిణి జ్ఞానవేణిలపై బదిలీ వేటు వేసింది. ఈ కీలక అధికారుల మధ్య సమన్వయ లోపమే ప్రపంచ స్థాయి గుర్తింపు రద్దవడానికి కారణమని తప్పును వారిపై నెట్టేసింది. రుషికొండకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దిద్దుబాటు చర్యలు దిగినట్లు కలరింగ్ ఇస్తోంది.
విశాఖపై సవతి ప్రేమ
విశాఖపై కూటమి ప్రభుత్వానికున్న సవతి ప్రేమ ఈ ఉదంతంతో బట్టబయలైంది. గత ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలు విశాఖపై విషం చిమ్ముతూనే ఉన్నాయి. విశాఖలో అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టులు, కీలక నిర్మా ణాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తూ వచ్చా యి. అయినప్పటికీ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా రుషికొండ బీచ్‌ను రూ.7.35 కోట్లతో అభివృద్ధి చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించింది. దీంతో రుషికొండ బీచ్‌కు పర్యావరణహిత, ప్రమాద రహిత బీచ్‌లకు అందించే బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ 2020, అక్టోబర్ 11న దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 13 బీచ్‌లు ఈ సర్టిఫికేషన్ కోసం పోటీపడగా రుషికొండ బీచ్ అందులో ఒకటిగా ఈ గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు ఈ గుర్తింపును నిలబెట్టుకుంటూ వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో పర్యాటకం పూర్తిగా పడకేసింది. ఇక్కడి బీచ్‌లో సౌకర్యాలపై కనీసం దృష్టి సారించలేదు. పర్యాటక శాఖకు పైసా కూడా విదిల్చలేదు. దీంతో ఈ బీచ్ కళావిహీనంగా మారిపోయింది. ఫలితంగా బ్లూఫ్లాగ్ గుర్తింపును డెన్మార్క్ సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్(ఎఫ్‌ఈఈ) రద్దు చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కూటమి ప్రభుత్వం బూటకపు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ పరిణామాలకు అధికారులనే బాధ్యులను చేసి వారిపై బదిలీ వేటు వేసింది.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ‘బ్లూఫ్రాడ్’
ప్రభుత్వ నిర్లక్ష్యం, చేసిన తప్పిదాలు కారణంగా ‘బ్లూ ఫ్లాగ్’కాస్తా ‘బ్లూ ఫ్రాడ్’గా మారిపోయింది. బీచ్ నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు కేంద్రం నుంచి వచ్చిన బ్లూఫ్లాగ్ నిధులను మాత్రం మింగేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతలతో చేతులు కలిపి ఈ నిధులను దోచు కున్నారన్న టాక్ ఉంది. ఫలితంగానే పర్యాటకులు సేదతీరేందుకు కూడా కనీస వసతులు లేకుండా పోయాయి. వాస్తవానికి బ్లూఫ్లాగ్ బీచ్‌కు నోడల్ అధికారిగా జిల్లా పర్యాటక శాఖ అధికారి జ్ఞానవేణి వ్యవహరించాలి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అధికారాలన్నీ రీజినల్ డైరెక్టర్ చేతిలో పెట్టింది. గత ఆర్డీని బదిలీ చేసిన ప్రభుత్వం టూరిజం ఈఈగా ఉన్న రమణను ఇన్‌చార్జి ఆర్డీగా నియమించింది. దీని ప్రకారం ఆయనే రుషికొండ బీచ్‌లో సౌకర్యాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే వీరిద్దరి మధ్య సమన్వయలోపం కారణంగా ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దయిందని కూటమి ప్రభుత్వం వారిపై బదిలీ వేటు వేస్తూ.. సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment