పోక్సో కోర్టు పీపీగా రాజశేఖర్
విశాఖ లీగల్ : నగరంలోని పోక్సో కోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బి.రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వతేజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో సీనియర్ న్యాయవాదిగా ఉన్న రాజశేఖర్ పలు క్రిమినల్, సివిల్ కేసుల్లో మంచి ప్రతిభ చూపించారు. రాజశేఖర్ 2001లో నగరంలో ఎన్‌బీఎం లా కాలేజీ నుంచి న్యాయవిద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత బార్ కౌన్సిల్ ద్వారా న్యాయవాదిగా నమోదయ్యారు. పలు పబ్లిక్, ప్రైవేటు రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2018 నుంచి మూడేళ్ల పాటు జిల్లా పరిషత్ న్యాయ సలహాదారుడిగా వ్యవహరించారు. రాజశేఖర్ నియామకం పట్ల విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, బార్ కౌన్సిల్ సభ్యుడు పి.నర్సింగరావు, కె.రామజోగేశ్వరరావు, బైపా అరుణ్ కుమార్, సీనియర్ న్యాయవాదులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment