● చల్లని కర్బూజా... రుచి ఎంతో మజా | - | Sakshi
Sakshi News home page

● చల్లని కర్బూజా... రుచి ఎంతో మజా

Published Wed, Mar 5 2025 1:05 AM | Last Updated on Wed, Mar 5 2025 1:01 AM

● చల్

● చల్లని కర్బూజా... రుచి ఎంతో మజా

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉచిత శిక్షణ

తుమ్మపాల : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్‌ఏఎంపీ పథకం ద్వారా ఉచిత శిక్షణ నిర్వహిస్తామని అనకాపల్లి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజరు జి. నాగరాజారావు మంగళవారం తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందుటకు ఆర్‌ఏఎంపీ పథకం ద్వారా వ్యవస్థాపకత, నైపుణ్య అభివృద్ధిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంఎస్‌ఎంఈ ద్వారా గుర్తింపు పొందిన శిక్షణ సంస్థ ట్రెండ్జ్‌ ఐటీ వారితో నెల రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకుకోవాలన్నారు. అనకాపల్లి పట్టణంలోని ట్రెండ్జ్‌ ఐటీ, 12–46 మాక్స్‌ షాపింగ్‌ మాల్‌ పైన, 3 వ ఫ్లోర్‌, ఉషా ప్రైమ్‌ పక్కన, కాంప్లెక్స్‌ దగ్గర, అలాగే చోడవరం ట్రెండ్జ్‌ ఐటి, 5–20, లక్ష్మిపురం రోడ్‌, వేంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా గల కేంద్రాల్లో ఈ నెల 8 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. అనకాపల్లిలో అయితే 95021 66626, 99485 19782, చోడవరంలో 73860 84548, 77998 83952లో సంప్రదించాలన్నారు.. అభ్యర్థులు 18 నుంచి 58 సంవత్సరాలు వయసు కలిగి, ఆధార్‌ కార్డ్‌, పాస్‌ పోర్ట్‌ సైజు ఫొటోలు, కులధ్రువీకరణ పత్రం, రేషన్‌ కార్డుతో ఈ నెల 5 నుంచి సంప్రదించాలని సూచించారు.

జాతరకు అమ్మవారి ప్రతిమలు సిద్ధం

కంచరపాలెం రామ్మూర్తిపంతులుపేటలో కొలువైన పైడితల్లి అమ్మవారి జాతర కోసం సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 10న కంచరపాలెం వీధుల్లో అమ్మవారి విగ్రహాల ఊరేగింపు కనులపండువగా జరగనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా 300పైగా అమ్మవారి ప్రతిమలను తయారు చేయిస్తున్నారు. ఆకర్షణీయంగా సిద్ధమవుతున్న ఈ విగ్రహాలు జాతర శోభను మరింత పెంచనున్నాయి. – ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

No comments yet. Be the first to comment!
Add a comment
● చల్లని కర్బూజా... రుచి ఎంతో మజా 1
1/2

● చల్లని కర్బూజా... రుచి ఎంతో మజా

● చల్లని కర్బూజా... రుచి ఎంతో మజా 2
2/2

● చల్లని కర్బూజా... రుచి ఎంతో మజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement