సింహాచలం: సింహగిరి మాస్టర్‌ప్లాన్ మార్పులు–చేర్పులపై దేవదాయశాఖ టెక్నికల్ అడ్వైజర్ కొండలరావు బుధవారం పరిశీలన జరిపారు. 2000 నుంచి సింహగిరి దివ్యక్షేత్రం అభివృద్ధి పనులు ప్రారంభమవగా, ఆరేళ్ల క్రితం వరకు జరిగిన అభివృద్ధి పనులతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఆ తర్వాత సింహగిరిపై కొన్ని అభివృద్ధి పనుల్లో మార్పులు చేర్పులతోపాటు, ఏడాదిన్నర కిందట ప్రసాద్ పథకం పనులు ప్రారంభమయ్యాయి. దీంతో మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేర్పులు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రసాద్ పథకం పనులతో పాటు ఇంకా దేవస్థానం తరఫున చేయాల్సిన అభివృద్ధి పనుల వివరాలను చేర్చి మాస్టర్ ప్లాన్‌ని పక్కాగా తయారుచేయాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ టెక్నికల్ అడ్వైజర్ తన బృందంతో వచ్చి ప్రసా ద్ పథకం పనులను పరిశీలించారు. అధికారులు, వైదికులతో చర్చించి పక్కాగా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు నివేదికలను కమిషనర్‌కు పంపిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment