పెందుర్తి: ెపందుర్తి మండలం పినగాడిలో అధికార తెలుగుదేశం పార్టీలోని వర్గపోరు మరోసారి రోడ్డెక్కింది. గ్రామం నడిబొడ్డున టీడీపీలోని రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు తన్నుకున్నారు. గ్రామంలోని శివాలయం వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన ఊరేగింపులో ఈ ఘటన చోటుచేసుకుంది. పల్లకీ మోయడం విషయంలో తలెత్తిన వివాదంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జీ వర్గీయులు బాహాబాహికి దిగారు. ఈ వివాదంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొట్లాట అనంతరం ఇరు వర్గాల నాయకులు పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే కేసు నమోదు కాకుండా రాజీ కుదిర్చేందుకు ఇరు వర్గాల ముఖ్య నేతలు పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఇదీ వివాదం.. : పినగాడిలోని బుధవారం శివాలయం వార్షికోత్సవం జరిగింది. రాత్రి 7 గంటల సమయంలో ఆలయం నుంచి శివుని ఉత్సవ మూర్తుల ఊరేగింపు ప్రారంభించారు. రాత్రి 9 దాటాక గ్రామంలోకి ఊరేగింపు ప్రవేశించింది. ఈ క్రమంలో పల్లకీని టీడీపీకి చెందిన ఒకే వర్గం(ఎమ్మెల్యే పంచకర్ల వర్గీయులు) పట్టుకోవడంపై మరో వర్గం (గండి బాబ్జీ వర్గం) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అరుపులు, తోపులాటలతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ‘మీ అంతు చూస్తాం’ ‘మీ సంగతి తెలుస్తాం’అంటూ ఇరు పక్షాలు సవాళ్లు విసురుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిపోయారు. అయితే అధికార పార్టీ నాయకుల కొట్లాట కావడంతో వెనువెంటనే చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకంజ వేశారు. ఈ నేపథ్యంలో కేసులు లేకుండా ఇరు వర్గాలు రాజీ చేసుకునే విధంగా ఆయా వర్గాల పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా.. గ్రామంలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా కొట్టుకోవడం చూసి గ్రామస్తులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. ఆధిపత్యం కోసం ఇరువర్గాలు ఇంతలా దిగజారాలా అని దుమ్మెత్తిపోస్తున్నారు.
‘శివుని’ఊరేగింపులో చెలరేగిన వివాదం
కొట్టుకున్న టీడీపీ రెండు వర్గాలనాయకులు
పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ
రాజీకి ముఖ్యనేతల మంతనాలు
Comments
Please login to add a commentAdd a comment