పిల్లల చెంతకు తల్లి
సీతమ్మధార: విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో దిక్కుతోచని స్థితిలో కనిపించిన అమ్ము అనే మహిళకు ఏయూటీడీ సిబ్బంది పునర్జన్మనిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా మూలస్థానం గ్రామానికి చెందిన అమ్ము భర్త తాగుబోతు. ఆయన చిత్రహింసలు భరించలేక మానసిక వేదనకు గురైన ఆమె కొన్నేళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయింది. స్నేహాలయ సంస్థ సహకారంతో కో లుకుని మేనమామ సంరక్షణలో ఉన్న పిల్లల వద్దకు చేరినా, మందులు మానేయడంతో మూడేళ్ల కిందట మళ్లీ రోడ్డున పడింది. అలా విశాఖ చేరిన ఆమెను ఏయూటీడీ సంస్థ చేరదీసింది. ఆమెను ద్వారకానగర్‌లోని జీవీఎంసీ–ఏయూటీడీ వసతి గృహానికి తరలించి శ్రద్ధా ఫౌండేషన్ ద్వారా వైద్య సహాయం అందించారు. కోలుకున్న అమ్మును గురువారం డిప్లమో చదివిన కుమారుడు, ఇంటర్ చదువుతున్న కుమార్తెకు, వారి మేనమామ సమక్షంలో అప్పగించారు. తమ తల్లి తిరిగి రావడంతో పిల్లలు ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఏయూటీడీ, శ్రద్ధా ఫౌండేషన్ సంస్థలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment