వీఎంఆర్డీఏ తహసీల్దార్‌పై ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

వీఎంఆర్డీఏ తహసీల్దార్‌పై ఫిర్యాదులు

Published Fri, Mar 7 2025 9:06 AM | Last Updated on Fri, Mar 7 2025 9:06 AM

-

విశాఖ సిటీ: వీఎంఆర్డీఏలో తహసీల్దార్‌(భూసేకరణ)గా విధులు నిర్వర్తిస్తున్న కోరాడ వేణుగోపాల్‌పై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎస్‌.రాయవరం మండలం తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయా లని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆయనపై చట్టపరంగానే కాకుండా సర్వీస్‌ నిబంధనల ప్రకారం చర్య లు తీసుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎం, హెచ్‌ఆర్‌డీ మంత్రి, డీజీపీ, సీసీఎల్‌ఏ, ఇతర అధికారులతో పాటు వీఎంఆర్డీఏ చైర్మన్‌కు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. గతంలో తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ఎంపీటీసీ, ఎంపీపీలుగా గెలిచినట్లు నిర్ధారణ అయినప్పటికీ.. ఎన్నికల్లో వారిని అనర్హులుగా ప్రకటించకపోవడంపై వేణుగోపాల్‌పై విచారణ చేసి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఆయన ఎస్‌.రాయవరంలో తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో అనేక అవకతవకలకు పాల్పడి భూ అక్రమాలకు అండగా నిలిచారని.. దీనిపై కూడా విచారించాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి అవినీతి ఆరోపణలు ఉన్న వేణుగోపాల్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత పీఎస్‌గా నియమించాలని ప్రయత్నిస్తుండడం సరైన నిర్ణయం కాదని వారు లేఖలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement