వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్, విడుద
డాబాగార్డెన్స్: గుడివాడ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్యాంసుందర్‌ను విశాఖ వన్‌టౌన్ పోలీసులు తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టకుండా వైఎస్సార్‌సీపీ కేడర్‌ని టార్గెట్ చేస్తూ, వేధించడం సరికాదన్నారు. శ్యామ్‌సుందర్ కుటుంబ సభ్యుల పరిస్థితి తెలుసుకుని వారికి యువకుడికి ష్యూరిటీ ఇప్పించి 41 నోటీసు ద్వారా విడిపించి, తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
అప్రమత్తమైన వైఎస్సార్‌సీపీ కేడర్ : వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్యాంసుందర్‌ను వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలుసుకున్న వాసుపల్లి, స్థానిక నాయకుల్ని అప్రమత్తం చేశారు. తక్షణమే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు. పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్రభరత్, పలు వార్డుల నాయకులు పీతల వాసు, ముత్తాబత్తుల రమేష్, యువజన విభాగం అధ్యక్షుడు, తాడి రవితేజ, సోషల్ మీడియా ప్రెసిడెంట్ బెవర మహేష్, కంటుముచ్చు సాగర్, సూర్యనాయుడు, గోపిరాజు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐతో మాట్లాడారు. ష్యూరిటీ ఇప్పించి, 41 నోటీస్ ద్వారా శ్యామ్ సుందర్‌ను విడిపించారు. అనంతరం శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ వాసుపల్లి గణేష్‌కుమార్‌కు, నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment