
విజయోస్తు సీ్త్రరస్తు...!
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
విజయోస్తు
సీ్త్రరస్తు..!
ఆటోతో
జీవన ప్రయాణం
ఆటో నడుపుతూ వాణికుమారి
డాబాగార్డెన్స్: ఆటో డ్రైవర్ అనగానే మనకు పురుషులే గుర్తుకొస్తారు. డ్రైవింగ్ ఫీల్డ్ కష్టంతో కూడుకున్నది కావడంతో.. మహిళలు ఈ రంగంవైపు పెద్దగా ఆసక్తి చూపరు. డ్రైవింగ్ ఫీల్డులోకి వచ్చిన మహిళల్లోనూ ఎక్కువ మంది కొన్నేళ్లు మాత్రమే ఈ రంగంలో ఉంటారు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు చూస్తున్న మహిళ మాత్రం 23 ఏళ్లుగా.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆరిలోవకుచెందిన వాసంశెట్టి వాణికుమారికి భర్త లేడు..కుమార్తెతో కలిసి జీవిస్తోంది. డ్రైవింగ్ నేర్చుకుంది. దీంతో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమార్తెను డిగ్రీ వరకు చదివించింది. ఆరిలోవ..జగదాంబ జంక్షన్, తిరిగి జగదాంబ జంక్షన్–ఆరిలోవ వరకు టికెట్ సర్వీస్ చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా టికెట్ సర్వీస్ చేస్తూ ఆదాయం పొందుతోంది. తనకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందని, రుణం తీసుకుని సొంతంగా ఆటో కొనుగోలు చేశానని వాణి కుమారి చెప్పారు.

విజయోస్తు సీ్త్రరస్తు...!

విజయోస్తు సీ్త్రరస్తు...!
Comments
Please login to add a commentAdd a comment