
గ్రీన్‌పార్క్‌లో సంప్రదాయ వస్త్రాల ప్రదర్శన
డాబాగార్డెన్స్: ఉగాది పండగ పురస్కరించుకుని నగరంలో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది. వాల్తేర్ మెయిన్‌రోడ్డులోని హోటల్ గ్రీన్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పో ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుంది. సంప్రదాయ దుస్తులకు ప్రాధాన్యమిచ్చే వారికి ఇది ఒక చక్కటి వేదిక. సరికొత్త ఫ్యాషన్ వస్త్రాలతో పాటు అన్ని రకాల సంప్రదాయ దుస్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రదర్శనలో మహిళలను ఆకట్టుకునేలా వివిధ రకాల దుస్తులు కొలువుదీరాయి. పట్టు చీరలు, కాటన్ వస్త్రాలు, సల్వార్‌లు, టాప్స్ వంటి వా టితో పాటు అనేక రకాల ఉపకరణాలు, డిజైనర్ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రత్యేకంగా పోచంపల్లి, కలంకారి చీరలు, కోల్‌కత్తా, భాగల్‌పురి ప్రింట్లు, లక్నో చికాన్ వర్క్ చీరలు, బెనారస్ పట్టు చీరలు వంటివి ఇక్కడ లభిస్తున్నాయి. అంతేకాకుండా మగ్గాలపై నేసిన, రంగులు వేసిన, ముద్రించిన, ఎంబ్రాయిడరీ వస్త్రాలు ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. మట్కా సిల్క్ చీరలు, మధ్యప్రదేశ్, పాట్లీ పల్లు, మల్బరీ సిల్క్, చందేరి చీరలు కూడా సరసమైన ధరలకే విక్రయిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రదర్శన, విక్రయాలు ఉంటాయని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment