మధురవాడలో ఆలయాల నిర్మాణానికి శంకుస్థాపన
మధురవాడ: మధురవాడ వైఎస్సార్ కాలనీలోని శ్రీ వాసవి మాత ఆలయ ఆవరణలో శివుడు, వేంకటేశ్వర స్వామి ఆలయాలతోపాటు వారాహి మాత ఆలయాలు నిర్మాణానికి సోమవారం కమిటీ ప్రతినిధులు, పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు, అధికార పార్టీ నాయకులు శంకుస్థాపన చేశారు. గరివిడి శ్రీ విద్యా సౌరశక్తి పీఠానికి చెందిన ఆగమశాస్త్ర పండితులు సూర్యసదనంచే ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం సేవా సంఘం ప్రతినిధులు, నిర్మాణ కమిటీ ప్రతినిధి, వేంకటేశ్వర విద్యాసంస్థల అధినేత యేటూరి వేంకటేశ్వర్లు, పైడా విద్యాసంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, కంకటాల మల్లికార్జునరావు, వైభవ్ జ్యూయలర్స్ గ్రంధి మల్లికా మనోజ్, మేఘాలయ గ్రంధి సురేష్, శ్రీకన్య, సినీపోలీస్ ఎన్‌వీఎస్ గురుమూర్తి, ఏఎస్ స్టీల్ ట్రేడర్స్ ఎ.నగేష్, వీ కన్వెన్షన్స్ పీవీ నరసింహారావు, జేకే లాజిస్టిక్స పి.శోభన్ ప్రకాష్, శ్రీకన్య ఫార్‌ూచ్యన్ కె. గురుమూర్తి, ఏయా ఆచార్యులు మద్దుల రామ్‌జీ, తిరుమల స్టీల్స్ గ్రంధి రాంజీ, లివింగ్ లైన్స్ శ్రీనివారావు, కార్పొరేటర్‌లు మొల్లి హేమలత, పిళ్ల మంగమ్మ, జెడ్సీ కనకమహాలక్ష్మి, నిర్మాణ కమిటీ ప్రతినిధులు పి.జగదీశ్, లక్ష్మీనారాయణ, కొల్లి వాసు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment