మనస్తాపంతో మరొకరు.. - | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో మరొకరు..

Published Sun, Jun 16 2024 12:34 AM

-

భామిని: భార్య మాట వినడం లేదని తీవ్ర మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... మండలంలోని బిల్లుమడ కాలనీలో గంగాధర పద్మనాభం చిన్న హోటల్‌ నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. శుక్రవారం ఉదయం హోటల్‌ తీసే సమయానికి అతని భార్య రాకపోవడంతో మందలించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన పద్మనాభం పురుగు మందు తాగాడు. వెంటనే భార్య, స్థానికులు గమనించి 108 వాహనంలో భామిని పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పి. కాంతారావు తెలిపారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement