వ్యక్తి ఆత్మహత్య - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Published Sun, Jun 16 2024 12:36 AM

వ్యక్తి ఆత్మహత్య

రాజాం సిటీ: మండల పరిధి గడిముడిదాం గ్రామానికి చెందిన ముడిదాన గురయ్య (42) శనివారం ఉరివే సుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గురయ్య తన భార్యాపిల్లలతో కలిసి విశాఖపట్నం ఉంటున్నాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరగడంతో స్వగ్రామానికి వచ్చి మళ్లీ విశాఖ వెళ్లిపోయాడు. వారం రోజుల కిందట టీవీ తీసుకువచ్చి ఇంటిలో ఒక్కడే ఉంటున్నాడు. ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. ఇదిలా ఉంటే శనివారం మధ్యాహ్నం ఇంటిలో నుంచి మాడు వాసన రావడంతో స్థానికులు చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై. రవికిరణ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement