మరియగిరి.. భక్త సిరి | - | Sakshi
Sakshi News home page

మరియగిరి.. భక్త సిరి

Published Fri, Jan 31 2025 1:26 AM | Last Updated on Fri, Jan 31 2025 1:27 AM

మరియగ

మరియగిరి.. భక్త సిరి

వీరఘట్టం: శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మరియమాత జాతర గురువారం వైభవంగా సాగింది. వీరఘట్టం సమీపంలోని యు.వెంకమ్మపేట వద్ద మరియగిరి కొండపై వెలసిన మరియమ్మకు శ్రీకాకుళం మేత్రాసనం ఫీఠాదిపతి రాయరాల విజయకుమార్‌ సమక్షంలో భక్తులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. మేరీమాత స్త్రోత్రం వినిపించారు. ఓ తల్లీ మరియా... మమ్మల్ని కాపాడమ్మా అంటూ ప్రార్థించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశా రాష్ట్రం నుంచి సుమారు 40వేల మంది భక్తులు దివ్యబలిపూజలో పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా కొండపైకి నడుచుకుంటూ వెళ్లి మేరిమాతను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. కొత్తగా ఏర్పాటుచేసిన మేరీమాత విగ్రహాన్ని శ్రీకాకుళం బిషప్‌ విజయ్‌కుమార్‌, నెల్లూరు బిషప్‌ ఆంథోనిరాజ్‌ ఆవిష్కరించారు. వీరఘట్టం, చిట్టపుడివలస, సివిని, పార్వతీపురం, బెలగాం, గరుగుబిల్లి, తూడి, పాలకొండ, వంగర, తలవరం, సంకిలి, నవగాం, పాలవలస గురుమండలాల్లో ఇటీవల నిర్వహించిన బైబిల్‌ పోటీలు, ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో పాలకొండ సీఐ చంద్రమౌళి పర్యవేక్షణలో వీరఘట్టం, సీతంపేట, దోనుబాయి, చినమేరంగి ఎస్‌ఐలు బందోబస్తు విధులు నిర్వహించారు. పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం డిపోల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు. జాతరలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను అలరించాయి.

మరియమ్మను దర్శించుకున్న భక్తజనం

దివ్యపూజలు చేసిన శ్రీకాకుళం

మేత్రాసనం ఫీఠాదిపతి విజయకుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
మరియగిరి.. భక్త సిరి 1
1/4

మరియగిరి.. భక్త సిరి

మరియగిరి.. భక్త సిరి 2
2/4

మరియగిరి.. భక్త సిరి

మరియగిరి.. భక్త సిరి 3
3/4

మరియగిరి.. భక్త సిరి

మరియగిరి.. భక్త సిరి 4
4/4

మరియగిరి.. భక్త సిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement