ప్రతి పంచాయతీలో పనులు జరగాలి
● కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
విజయనగరం ఫోర్ట్: ప్రతి పంచాయతీలోనూ ఉపాధిహామీ పనులు జరగాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు, పనిదినాలపై ఎంపీడీఓ, ఫీల్డ్ అసిస్టెంట్స్‌తో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉన్నది రెండు నెలలు గడువేనని, ఈ ఏడాది లక్ష్యాలను పూర్తి చేయకపోతే వచ్చే ఏడాదికి నిధులు రాకపోవచ్చని తెలిపారు. పేద ప్రజలకు నష్టం జరిగితే సహించేది లేదన్నారు. అందుబాటులో ఉన్న నిధులను పూర్తి స్థాయి లో వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ ఎస్.శారదాదేవి పాల్గొన్నారు.
మడ్డువలసలో అక్రమంగా చేపల వేట
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపలవేట అక్రమంగా సాగుతోంది. కొట్టిశకు చెందిన శ్రీ సీతారామా ఫిషర్‌మెన్ సొసైటీ ఆధ్వర్యంలో 574 మంది సభ్యులు ప్రాజెక్టులో చేపలు వేట చేయాల్సి ఉంది. దీనికోసం నాలుగు ఫసలీలు లీజు మొత్తం సుమారు రూ.30 లక్షలు పైచిలుక చెల్లించాలి. వారు ఆ మొత్తం చెల్లించకపోవడంతో జిల్లా మత్స్యశాఖ అధికారులు మడ్డువలస రిజర్వాయర్‌లో చేపలవేట నిషేధం అమలుచేశారు. ఇదే అదునుగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ఇక్కడకు వలస వచ్చిన మత్స్యకారులు ప్రాజెక్టులో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫింగర్ రింగ్ సైజ్ చేపపిల్లలను సైతం వేటాడి పొరుగు రాష్ట్రం ఒడిశాకు తరలించి విక్రయిస్తున్నారు. ప్రతిరోజు వేటాడిన టన్నులకొద్దీ చేపల రవాణా మత్స్యశాఖ అధికారులు కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని రాజాం ఎఫ్‌డీవో ప్రసాద్ వద్ద ప్రస్తావించగా ఎక్కడ వేట సాగిస్తున్నారో చెబితే పరిశీలిస్తామని సమాధానమిచ్చారు. చేపలు వేట చేయొద్దని మత్స్యకారులకు నోటీసులు అందించామని, ఇకపై నిబంధనలు కఠిన తరం చేస్తామన్నారు. శ్రీ సీతారామా ఫిషర్‌మెన్ సొసైటీ నాలుగు ఫసలీల మొత్తం లీజు చెల్లించకపోవడంతో చేపల వేట నిషేధం అమలులో ఉన్న మాట వాస్తవమేనన్నారు.
కారును ఢీకొట్టిన జేసీబీ
● మోదవలస ఎంపీటీసీ మాజీ సభ్యుడు మృతి
పూసపాటిరేగ: భోగాపురం మండలం నారుపేట సమీపంలో గురువారం రాత్రి కారును జేసీబీ ఢీకొన్న ప్రమాదంలో మోదవలస ఎంపీటీసీ మాజీ సభ్యుడు బోని అప్పలనాయుడు దుర్మరణం చెందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డెంకాడ మండలం మోదవలసకు చెందిన బోని అప్పలనాయుడు (51) భోగాపురం నుంచి రాజాపులోవ వైపు తన కారులో వెళ్తుండగా నారుపేట సమీపంలో రాంగ్‌రూట్‌లో వస్తున్న జేసీబీ ఢీకొంది. కారు డ్రైవింగ్ సీటులో ఉన్న అప్పలనాయుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను స్థానికులు చికిత్స నిమిత్తం ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన కుమార్తె బోని యశస్విని ప్రస్తుతం మోదవలస వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. భోగాపురం ఎస్‌ఐ పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment