మహా కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
విజయనగరం: మహా కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుందని ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు వయా భువనేశ్వర్, కోణార్క్, పూరి, ప్రయాగరాజ్, వారణాసి మీదుగా అయోధ్యకు వెళ్లి తిరిగి 13వ తేదీన రాత్రి విజయనగరం చేరుకుంటాయని తెలిపారు. మహా కుంభమేళా ప్రత్యేక బస్సు టికెట్లను ఆన్లైన్, బస్టాండ్లో రిజర్వేషన్ కౌంటర్లో బుక్చేసుకోవచ్చన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారంతో పాటు రానుపోను టికెట్ ధర రూ. 10,500లుగా పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్: 99592 25620, 94943 31213 నంబర్లను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment