ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
వనపర్తి: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, జి.వెంకటేశ్వర్లుతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కార మార్గం చూపాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రజావాణి ఫిర్యాదులతో పాటు జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 67 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
పోలీసు ప్రజావాణికి ఆరు అర్జీలు
వనపర్తి: పోలీసు ప్రజావాణికి వచ్చిన పిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం ఆరు ఫిర్యా దులు అందగా.. వాటి పరిష్కారానికి చర్యలు తీసు కోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పని చేస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment