విధులపై అలసత్వం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధులపై అలసత్వం వహిస్తే చర్యలు

Published Tue, Jan 28 2025 1:04 AM | Last Updated on Tue, Jan 28 2025 1:04 AM

విధుల

విధులపై అలసత్వం వహిస్తే చర్యలు

పాన్‌గల్‌: విధులపై అలసత్వం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డా.శ్రీనివాసులు అన్నారు. సోమవారం పాన్‌గల్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు ఓపీ వివరాలను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గర్భిణుల నమోదు పక్కాగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు అయ్యేలా చూడాలన్నారు. పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. ప్రభుత్వం వైద్యారోగ్యశాఖ ద్వారా అందించే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఉప కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. డీఎంహెచ్‌ఓ వెంట జిల్లా టీబీ నోడల్‌ అధికారి డా.వంశీకృష్ణ, పీహెచ్‌సీ డా.చంద్రశేఖర్‌ ఉన్నారు.

పీఎఫ్‌ ఖాతాలో

తప్పులను సరిదిద్దుకోవాలి

వనపర్తి టౌన్‌: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే కార్మికులు పీఎఫ్‌ ఖాతాలోని తప్పులను సరిదిద్దుకోవాలని పీఎఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి సుందర్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ సర్కిల్‌ కార్యాలయ సమీపంలో పీఎఫ్‌పై కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌, పీఎఫ్‌ అకౌంట్‌, కార్యాలయాల్లో ఉన్న పేర్లు, ఇతర ధ్రువపత్రాల్లో ఉన్న పేర్లు సరిగ్గా ఉండేలా చూసుకోవాలన్నారు. వాటిని సరిదిద్దుకుంటేనే పీఎఫ్‌ క్రమం తప్పకుండా ఖాతాల్లో జమ అవుతుందన్నారు. కార్మికుల భవిష్యత్‌ అవసరాలు, పిల్లలపెళ్లిళ్లు, ఇతర అవసరాలకు పీఎఫ్‌ నిధులు ఉపయోగపడుతాయని.. పీఎఫ్‌ ఖాతాలో తప్పుల దిద్దుబాటుకు కార్మికులు చొరవ చూపాలని సూచించారు. కార్యక్రమంలో పీఎఫ్‌ అధికారి అమర లింకస్వామి తదితరులు పాల్గొన్నారు.

నేడు డయల్‌

యువర్‌ డీఎం

వనపర్తి టౌన్‌: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో మంగళవారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్‌ వేణుగోపాల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికులు మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 4 గంటల వరకు 73828 26289 నంబర్‌ను సంప్రదించి.. సమస్యలను తెలియజేయడంతో పాటు సూచనలు, సలహాలు అందించాలని కోరారు.

పకడ్బందీగా

ప్రాక్టికల్‌ పరీక్షలు

వనపర్తి: ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు, పర్యావరణ విద్య, నైతిక మానవ విలువల పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో జనరల్‌, ఒకేషనల్‌ విభాగాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 3,404 మంది, ద్వితీయ సంవత్సరం 3,187 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ఈ నెల 29న నైతిక విలువలు, మానవ విలువలపై బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు, 30న ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్యపై పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయానికి ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ జి.వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి అంజయ్య తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విధులపై అలసత్వం వహిస్తే చర్యలు  
1
1/1

విధులపై అలసత్వం వహిస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement