సకాలంలో టీకాలు వేయించాలి
గోపాల్పేట: ప్రతి చిన్నారికి సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తే భవిష్యత్‌లో వచ్చే రోగాల నుంచి కాపాడుకోవచ్చని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. పరిమళ సూచించారు. బుధవారం ఆమె మండలంలోని పలు ఆరోగ్య ఉపకేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాలను తనిఖీచేసి వ్యాధి నిరోధక టీకాల రికార్డులను పరిశీలించిన అనంతరం సిబ్బందితో మాట్లాడారు. చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, గర్భిణులకు టీటీ ఇంజక్షన్‌తో పాటు టీబీ, పోలియో, కామెర్లు, కంటసరిపి, కోరింత దగ్గు, దనుర్వాతం, నిమోనియా, తట్టు వంటి రోగాలు రాకుండా ఎప్పటికప్పుడు టీకాలు వేయాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా. కృష్ణకుమారి, డా. చాంద్‌పాషా, జిల్లా ఇమ్యునైజేషన్ కో–ఆర్డినేటర్ బాలచంద్రయ్య, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సిద్ధగౌడ్, సిబ్బంది సుచిత్ర, నాగమణి, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.
పార్టీ విస్తరణకు
సమష్టి కృషి : సీపీఎం
వనపర్తి రూరల్: రాబోయే రోజుల్లో పార్టీని జిల్లాలోని 15 మండలాలకు విస్తరించడానికి కృషి చేస్తామని, సహచరులు, జిల్లా కార్యవర్గసభ్యుల సమష్టి నిర్ణయంతో ముందుకుసాగుతామని, సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపడతామని సీపీఎం రాష్ట్ర సభ్యుడు పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి జబ్బార్ తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరిగిన పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు విజయవంతంగా ముగిశాయన్నారు. మొదటిరోజు భారీ ప్రదర్శన, బహిరంగసభ, సాంస్కృతిక కార్యక్రమాలు, వేషధారణలు ప్రజలను ఆకట్టుకున్నాయని వివరించారు. మూడురోజుల పాటు జరిగిన సభల్లో 50 ప్రజా సమస్యలపై తీర్మానాలు చేశారని, భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర కమిటీని 60 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని.. జిల్లా వాసి దళిత సామాజికవర్గానికి చెందిన జాన్‌వెస్లీని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా మహాసభ ఎన్నుకుందని, ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌రెడ్డి, రాజు, లక్ష్మి, మేకల ఆంజనేయులు, పరమేశ్వరాచారి, నందిమళ్ల రాములు, రాబర్ట్, బీసన్న, మహేష్, ఉమా, సాయిలీల తదితరులు పాల్గొన్నారు.
రామన్‌పాడులో
1,020 అడుగులు
మదనాపురం: మండలంలోని రామన్‌పాడులో బుధవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 920 క్యూసెక్కుల వరద వస్తుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదన్నారు. ఎన్టీఆర్ కాల్వకు 764 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 10 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment