సాగు భూములకే రైతుభరోసా | - | Sakshi
Sakshi News home page

సాగు భూములకే రైతుభరోసా

Published Thu, Jan 30 2025 12:57 AM | Last Updated on Thu, Jan 30 2025 12:58 AM

సాగు భూములకే రైతుభరోసా

సాగు భూములకే రైతుభరోసా

వనపర్తి: సర్వేలో జిల్లాలో గుర్తించిన సాగు భూములకే రైతు భరోసా సాయం అందాలని.. వ్యవసాయేతర భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఫ్రీజ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులతో వెబెక్స్‌లో సమావేశమయ్యారు. రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేసే ప్రక్రియ ప్రారంభమైందని.. అర్హులకే సాయం అందేలా చూడాలన్నారు. రైతు తన భూమిలోని కొంతభాగాన్ని వ్యవసాయం చేస్తూ.. మరికొంత భాగం వ్యవసాయేతర భూమిగా వినియోగిస్తుంటే విడదీయాలని తెలిపారు. తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు కూర్చొని సమన్వయంతో ఈ ప్రక్రియ సాయంత్రంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రేషన్‌ కార్డుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంచిత్‌ గంగ్వార్‌, జి.వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్‌, తహసీల్దార్‌ మదన్‌మోహన్‌ పాల్గొన్నారు.

ప్రయోగాత్మకంగా బోధించాలి..

విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధిస్తే సులువుగా పట్టు సాధిస్తారని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రత్యేక నిధులతో కొనుగోలు చేసిన 116 సైన్స్‌ఫెయిర్‌ కిట్లను ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అందజేసి మాట్లాడారు. విద్యార్థుల సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేయాలే తప్పా వారిని అణిచివేయవద్దని సూచించారు. ప్రతి సైన్స్‌ ఉపాధ్యాయుడు కిట్లను సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు ప్రయోగాత్మక విధానంలో బోధించాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యాశాఖను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని, ఇటీవల కేజీబీవీలో కోడింగ్‌ క్లాసెస్‌, ఇంటర్‌ విద్యార్థులను ఐఐటీ కళాశాలకు తీసుకెళ్లి చూపించామన్నారు. జిల్లాలో 35 ఏళ్లుగా రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ద్వారా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సెక్రెటరీ చిన్నమ్మ థామస్‌ను కొనియాడారు. ఆర్డీఎస్‌ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్‌ మాట్లాడుతూ.. భవిష్యత్‌లోనూ జిల్లా అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని చెప్పారు. ఆర్డీఎస్‌ తరఫున ఇద్దరు అనాథ విద్యార్థినులకు రూ.లక్ష స్కాలర్‌షిప్‌ చెక్కులను అందజేశారు. ఇదే కార్యక్రమంలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గతేడాది ప్రభుత్వ పాఠశాలలలు, కేజీబీవీలో పది, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించారు. అలాగే రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్‌, క్విజ్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సైతం ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్‌ ఘని, జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాస్‌, సైనన్స్‌ ఉపాధాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement