సీఎంఆర్‌ దందా..!? | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ దందా..!?

Published Thu, Jan 30 2025 12:57 AM | Last Updated on Thu, Jan 30 2025 12:57 AM

సీఎంఆ

సీఎంఆర్‌ దందా..!?

ఇతర జిల్లాలకు ధాన్యం కేటాయింపులు

జిల్లాలో డిఫాల్ట్‌ మిల్లర్లు

ఉన్నందునే..

జిల్లాలోని మిల్లర్లు డిఫాల్ట్‌ జాబితాలో చేరడంతో పక్క జిల్లాలకు వరి ధాన్యం కేటాయింపులు చేశాం. కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లుగాని.. విజిలెన్స్‌ విచారణ ప్రారంభించినట్లుగాని మా దృష్టికి రాలేదు. ఈ విషయంపై ఎలాంటి ఆధారాలున్నా సమర్పించాలి.

– వెంకటేశ్వర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్‌

వనపర్తి: జిల్లా పౌరసరఫరాలశాఖలో కొంతకాలంగా కొనసాగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారం రాష్ట్రస్థాయి విజిలెన్స్‌ అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులపై విజిలెన్స్‌శాఖ డీఎస్పీ స్థాయి అధికారి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. జిల్లాలోని మిల్లర్లకు గతంలో కేటాయించిన ధాన్యం నిల్వల లెక్కలు.. తాజా కేటాయింపుల్లో భారీస్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా అంశాలపై కొన్నిరోజులుగా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులపై రహస్యంగా విజిలెన్స్‌ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. విచారణ అధికారులు బుధవారం డీఎస్‌ఓ, డీఎంను హైదరాబాద్‌లోని విజిలెన్స్‌ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించినట్లు సమాచారం.

రూ.లక్షల్లో..

జిల్లాలో అత్యధికంగా వరి ధాన్యం పండటం అధికారుల పాలిట వరంగా మారింది. గతంలో ధాన్యం కేటాయింపులు చేసిన మిల్లర్లు సకాలంలో సీఎంఆర్‌ అప్పగించని కారణంగా డిఫాల్టర్‌ జాబితాలో చేర్చి ఈ ఏడాది కేటాయింపులు చేయలేదనే విషయం తెలిసిందే. కొందరు అధికారులు దీనిని ఆసరాగా చేసుకొని ఇతర జిల్లాల్లోని మిల్లులకు ధాన్యం కేటాయించి మిల్లర్ల నుంచి రూ.2 లక్షల వరకు దండుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో జిల్లా పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్‌లో పనిచేసిన ఓ అధికారి ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో పనిచేస్తూ చక్రం తిప్పుతూ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై బుధవారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జిల్లాకు సంబంధించిన పొలిటికల్‌ జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి అక్రమాలపై పలు అంశాలు వెల్లడించారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం, పాలకవర్గం ఒక్కసారిగా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

జిల్లా పౌరసరఫరాలశాఖలోని ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ సదరు అధికారులు డబ్బుల లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు గుప్పించారు. విజిలెన్స్‌ అధికారులు ఈ విషయంపై సమగ్ర విచారణ చేస్తే చాలా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి బ్యాంకు ఖాతాలపై విజిలెనన్స్‌ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.

పక్క జిల్లాలకు 90 వేల మెట్రిక్‌ టన్నులు..

జిల్లా నుంచి మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, గద్వాల జిల్లాలకు సుమారు 90 వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని అధికారులకు సన్నిహితంగా ఉండే మిల్లర్లకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను అధికారులకు సదరు మిల్లర్లు రూ.లక్షల్లో నజరానాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

20 రోజులుగా విచారణ..

జిల్లా పౌరసరఫరాల శాఖలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ శాఖలో డీఎస్పీ స్థాయి అధికారితో 20 రోజులుగా విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సమగ్ర నివేదికను అతి త్వరలో రాష్ట్రస్థాయి అధికారులకు అందించనున్నట్లు సమాచారం.

90 వేల మెట్రిక్‌ టన్నులు

కేటాయించినట్లు ప్రాథమిక అంచనా

గతంలో జిల్లా పౌరసరఫరాలశాఖలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ

బుధవారం హైదరాబాద్‌లో విచారణకు హాజరైన సంబంధిత అధికారులు?

No comments yet. Be the first to comment!
Add a comment
సీఎంఆర్‌ దందా..!? 1
1/1

సీఎంఆర్‌ దందా..!?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement