నేరాల అదుపునకు సహకరించాలి
ఆత్మకూర్: ప్రజల సంరక్షణే ధ్యేయంగా పోలీసులు రేయింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్నారని.. నేరాల అదుపునకు ప్రజలు పొలీసులకు సంపూర్ణ సహకారం అందించాలని డీఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పట్టణంలోని బీసీకాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ శివకుమార్, ఎస్ఐ నరేందర్ ఆధ్వర్యంలో సిబ్బందిని ప్రతి ఇంటిని తనిఖీ చేసి వాహనాల ధ్రువపత్రాలను పరిశీలించారు. అనంతరం కాలనీలో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. దొంగిలించబడ్డ వాహనాలు వాడుక లో ఉన్నాయని.. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ప్రోత్సహించడం సరైందికాదన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం సరైన ధ్రువపత్రాలులేని 32 బైక్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. కార్యక్రమంలో ఆరుగురు ఎస్ఐలు, 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment