ఈసారి రైతుభరోసా కింద సాయం అందించేందుకు కేవలం వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌల్ట్రీ, రియల్ ఎస్టేట్ వెంచర్లు, లేఅవుట్లు, ఫిషరీస్, నాలా కన్వర్షన్, కమర్షియల్ తదితర భూములను గుర్తించి ఈ పథకం లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తోంది. అయితే అర్హులైన రైతులందరికీ సాయం అందించేందుకు లబ్ధిదారుల తొలగింపు ప్రక్రియ పూర్తికాక పోవడమే అడ్డంకిగా మారింది. వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి ఫ్రీజ్ చేస్తేనే మిగతా వారికి ఇచ్చేందుకు మార్గం సుగుమం కానుంది. ఒకే సర్వే నంబరులో ఉన్న వ్యవసాయ భూములు, వ్యవసాయ యోగ్యం కాని భూములను ఫ్రీజ్ చేసే విషయంలో పీటముడి నెలకొంది. ఈ కసరత్తు ఇంకా కొనసాగుతుండటంతో మరో వారం రో జుల తర్వాతే మిగతా రైతులకు ప్రభుత్వ సాయం అందించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment