గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి గ్యారెంటీ, ష్యూరిటీ లేకుండా మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపులు చేయడంతో జిల్లావ్యాప్తంగా రైస్‌మిల్లులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ధాన్యం కేటాయించడమేగాని.. సీఎంఆర్ వసూలుపై అధికారులు దృష్టి సారించకపోవడంతో పెండింగ్‌లో పడినట్లయింది. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సీఎంఆర్‌పై అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ మొత్తంలో బియ్యం ఇవ్వాల్సిన మిల్లులను బ్లాక్ లిస్టులో ఉంచారు. ప్రస్తుత సీజన్లో కేవలం 30 నుంచి 40 మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయింపులు చేశారు. ఎక్కువ మొత్తంలో పక్కా జిల్లాలకు కేటాయించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment