పేదల జీవితాల్లో వెలుగులు
వనపర్తిటౌన్: ఇందిరమ్మ రాజ్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో 44 మందికి రూ. 11.20లక్షల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కనీస అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అందులో భాగంగా రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని చెప్పారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అనంతరం వనపర్తి మండలంలోని కడుకుంట్లకు చెందిన వెంకటేష్‌కు వైద్య చికిత్సల నిమిత్తం రూ. 3.50 లక్షలు, పెబ్బేరు మండలంలోని గుమ్మడం గ్రామానికి చెందిన సౌదామినికి రూ. 1.25 లక్షల ఎల్ఓసీని అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా, కార్యదర్శి వేణుగోపాల్, ఖమ్మర్మియా, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment