ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
పాన్‌గల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులు వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీం (ఓటీఎస్)ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి సూచించారు. సోమవారం పాన్‌గల్ ప్రాథమిక సహకార సంఘం పాలక మండలి సభ్యులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018 మార్చి 31వ తేదీ వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ. 200 కోట్ల దీర్ఘకాలిక రుణాలను రైతులు పొందినట్లు వివరించారు. ఓటీఎస్ ద్వారా ఫిబ్రవరి 15వ తేదీలోగా రుణాలను చెల్లించే రైతులకు అపరాధ వడ్డీ మాఫీ అవుతుందని తెలిపారు. గడువు తేదీలోగా రుణాలు చెల్లించకుంటే.. అప్పులు రిజిస్టర్ పరిధిలోకి వెళ్లి లీగల్ యాక్షన్ ఉంటుందన్నారు. పాన్‌గల్ ప్రాథమిక సహకార సంఘంలో 336 మంది రైతులు రూ.10 కోట్ల వరకు దీర్ఘకాలిక రుణాలు పొందారన్నారు. రుణమాఫీ అయిన రైతులకు కొత్త పంట రుణాలు అందిస్తున్నామని.. నూతన రైతులకు కూడా త్వరలో రుణాలు అందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం, రేషన్‌కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించడంపై రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుర్వ బాలయ్య, సీఈఓ భాస్కర్‌గౌడు, డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment